నేను నా గది
సీసాలో అతుక్కు పోయిన
చివరి నీటిచుక్కలా
ఒంటరిగా బిగుసుకుపోతాయి
జ్ఞాపకాలు
-
గది
విడ్కోలప్పుడు వెనుదిరిగిన
చూపు
తలంపుల మంచం మీద వాలిన
ఆలోచనల కళేబరం
పైకప్పుకంటుకున్న నేత్ర నక్షత్రం
గది
దాపరికం లేని తలలోని నాలుక
గది
అడుగుల గుర్తులంతిల్లు
నా మటుకు నాకు
గది
నా సమాధి మన్ను మీద వాలిన
మట్టి ఆకు
నా శిలాక్షరం
(1-8-2016)
Comments
Post a Comment