ఘర్ వాపసి




నేను  తరచూ అనుకుంటాను
నా శరీరాన్ని
ప్రపంచం ఎట్లా  భుజిస్తుందని
ఇదంతా ప్రపంచంలోని  ఓ మూలన కూర్చున్న కాల  స్ధలంలో ఆలోచిస్తాను
ఆవరణలోని  గాలికి  రంగు, రుచి, వాసన వుంటాయి
అవి నా ఆలోచన శరీర పరిమళాన్ని  పరివ్యాపిస్తాయి
వంట వండుతునప్పుడు వచ్చే కూరల గుభాళింపులా.
మనం మన ఆలోచనల శరీర బందీలం.
ఎక్కాడా ఎవరూ వుండరు! అంతా జ్ఞాపకాల మట్టి పుట్టల్లో చీమల్లా వుంటారు,
వాళ్ళని నెమరేసుకునే నాలుకకి రుచిలేదు, అంతే!!
చీడ పట్టిన దుర్భర ఆలోచనకంటే మరో వైరస్ క్రిమిలేదు
ఇల్లు లేని వాళ్ళం, ఇల్లొదిలి తిరిగే తిరుగుబోతులం,
ప్రకృతిని చూడలేని గుడ్డివాళ్ళం,
ఇంట్లో వుండడం అంటే బందిఖానా అనుకునే వాళ్ళం
పురుడు, పుటుక , పెళ్ళి, చావు అంతా కాగిత పత్రాల పై ఆధారపడిన వాళ్ళం
కొనితెచ్చుకున్న చావుకి ఇంటిని ఆసుపత్రి  చేసుకున్న  వాళ్ళం
అసమాజిక జీవులం
ఇక ఆలోచనలకి  ఘడియలు ఎట్లా పెడతాం
బడి, గుడి ,అంగడి అన్నీ బంద్
ప్రపంచానికి గాలి సోకింది
మనం బతికిన తీరు, చదివిన  చదువు,సంపాదించిన డబ్బు  అంతా తూచ్...
రండి ఇంటి దగ్గరే  బడితిరిగి  పగలు రాత్రి చదువుకుందాం
ఇప్పుడైనా
ఇకనైనా
తప్పొప్పులు సరిద్దికుందాం
కనీసం ఇంట్లో ఎవరున్నారో, ఎప్పుడొస్తారో, ఎప్పుడుపోతున్నారు  
ఎలా వున్నారు,ఏమవ్వాలనుకుంటున్నారో...
వాట్స్ అప్ మెసేజిల్లా కాకుండా ...
 దాపరికాలు లేకుండా  మనస్సు విప్పి మాట్లాడుకుందాం
వైరస్లు వచ్చి పోతాయి, మనలో మిగిలిన  సహజీవనం ఆలోచనలు పోతే  తిరిగి  రావు,
అంతా వసు ధైక కుటుంబీకులం
మన శారీరక మనసుల్లోని కల్మషాల్ని రగిలించే రోగాన్ని
తరిమేద్దాం....
చిలక పచ్చని వేపాకులకి అల్లుకున్న తెల్లటి పులాలోచనలతో
ఛలో ఘర్ వాపసి...

(25-3-2020, కరోనా  సామాజిక, ప్రకృతి బాధితులకు, వారి కై అహర్నిశలు శ్రమించే వారికి)


Comments

  1. This article is of conservative

    Against the Development in various fields .
    Just like Rss Gharvapasi.

    ReplyDelete
  2. Let me know how to get unlimited knowledge.

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

పూల పుప్పొడి (ట్రిబ్యూట్ టు జి.ఉదయ్ భాస్కర్)

సరిహద్దు