జ్ఞాన ఫల వృక్షం
1.ఈ చెట్టు కింద కూర్చుని నాతో నేను నా అమ్మతో నా సఖితో నా కొడుకుతో నా వాళ్ళతో ఎన్నో సార్లు ముచ్చటించా కొన్ని మార్లు నాలో నేను ఎల్లప్పుడూ అది మౌనంగా తనలోని ఆకుల సవ్వడి లా ఓ కొమ్మకొనల తుంపర వర్షంలా ప్రతిస్పందించింది 2. మరో చోట దూరంగా ఒంటరిగా నా జీవితపు గెలుపోటమిని బేరీజు వేస్కుంటూ రెండువైపుల్న గెలుపోటములున్న తన ఆకుల నాణాన్ని ఎన్నెన్నోసార్లు గాలిలో ఎగరేసి లెక్కేసుకుంటూ గాలివాటంలా పరిగెట్టానో... దాని ఆకుల చూపులకీ దాని సహచరికీ మధ్య జరిగిన మౌన చూపుల సంభాషణ కే తెలియాలి నాకు వచ్చే కబురల్లా గాలి తంత్రాల జీవన శ్వాస చిత్ర రేఖల తరంగాల వేద రహస్యం 3. నా లానే ఎందరో దాని చుట్టూ వాలి వెళ్ళి పోతారు 4. ఇప్పుడు భారమైన మనస్సు నీరసించింది తరుచు తరుచు తన వారసత్వపు పసి మొలకల్ని తన చేరనే వుండి బాల స్పర్శతో తనని తానూ స్ప్రుజించుకోవాలని ఆరాటపడుతుంది మగతలో తనలో తానూ చిన్న అలికిడైనా ఎవరొచ్చారు ఎలావున్నారు బాగా వుండు బాగా చదువుకో అని కలవరిస్తుంది తన నీడ బాట లో వున్న ఊట బావి శబ్దంలా 5. కొన్ని...