Posts

Showing posts from April, 2014

చౌకి

రాత్రి రెండు గంటలకు చెట్లని చూస్తునప్పుడు పట్నం నుండి వస్తున్న అభివృద్ధి నియోన్ కాంతి అడవి గూటిని పెకలించడానికి వచ్చే ఎలక్షన్ మ్యానిఫెస్టో నాలుకలాగుంది ఆ మాయదారి నాలుక  గాలి  తాకకుండా సదా పహరా  కాసే నిశాచర జీవాల్లా చెట్లకల్లుకున్న పక్షి జంటలు కూస్తూనే వున్నాయి అందుకే రాత్రప్పుడు అందుకే రాత్రప్పుడు పక్షి కూతలు వినపడతాయి (21-4-14)

అద్దాల మేడలో ఉషోదయం

అద్దంలో పున్నమి చంద్రుడు ఇంట్లో సాంబ్రాణి ధూపంలా ఆరుబయట నేను కళ్ళలో అరికాళ్ళు పెట్టుకుని పడుకుంటా ---- చిట్లిన అద్దంలో ఉషోదయం దూరంగా రహదారులెంట ఇసుకలారీల్లో ఆవిరైపోతున్న తడిలా చంద్రుడు ఒక్కో చుక్కా రాల్చుకుంటూ రోడ్లకి టైర్లముద్రల ముగ్గులేస్తూ ప్రాణంలేని గాలిబుట్టల నగరాల వైపు పయనిస్తున్నాడు ఓ ప్రాణం లేని కంటిలో కనుపాపైపోడానికి --------- నేను  కిటికి తెరిచినప్పుడు  ఆరుబయట పచ్చటి పొదలో నల్లటి పిట్ట కంట్లొ  తెల్లటి పాటలా పిల్లకి బువ్వపెడుతూ కూస్తాడు (18-4-14)