Posts

Showing posts from December, 2013

జర్నీ

గబ్బిలం దృష్టి రెక్కల వేగంతొ రాత్రాంతా ప్రయాణం చలి తట్టుకోవడానికి గరిక గొంగళి శాలువా కప్పుతుంది ఇంటికి రాగానే శాలువానుండి వాకిట్లో రాలిన రక్తపు ధూళి చీకటి రంగు రంగుల పురి విప్పుతుంది అప్పుడే తలుపు తెరుస్తూ ఆమె దర్శనమిస్తుంది (16-9-13) (బడంగిపేట్ నుండి మా ఇంటివరకు వున్న దారి)

తెలుపు అంచు

మునిమాపు వేళ కొమ్మల పైన వాలిన కొంగలు ఇక అకాశంలో మరో కొంగ నక్షత్రాల మధ్యన విహరిస్తుంది లాంతరు అద్దం పైన వెలుగు చెరసాల చువ్వలా ఆమెని తలుచుకుంటూ ఓ తెలుపు అంచు  రెక్కల కోరిక కట్టినట్టు (11-10-13)