అడవి గింజ



మిట్ట మధ్యాహ్నం 

ఒంటరి నడక 
ఆలోచనడుగుల ఘోష
కళ్ళ నీడలా
వెన్నాడుతూనే వుంది

భూమినుండి పెకిలించేస్తున్నట్టు
పుట్టుకొస్తున్న
క్రికెట్ పురుగు చప్పుడు

ఓ ఆత్మప్రవచన
గీతంలా
సదా వినిపిస్తూనే వుంటుంది


కనుచూపు మెరలో కానరారెవరు
అడవి మొదట్లో...
వూరి చివర్లో...
పొలిమేర గట్టున
గుళ్ళలా

మర్రి మానులో
తాటి చెట్టో

తాటి చెట్టులో
మర్రి మానో

ఒకదానితో ఒకటి పెనవేసుకుని

పక్షి రెక్కలతో
నీలి గగన రంగుని
మట్టి వేర్లకి పొదుగాలన్న వాంఛతో

అయస్కాంత శక్తిని దాటి
పోతున్నాయి...


నా పయనమంతా

ఈ ద్రుశ్యమల్లిన

పిట్ట కూతంత 
గింజ స్పర్శని 
ఆలింగనం చేసుకునేందుకు

అన్వేషణే...

(2-11-13)

Comments

  1. కవిత చాలా హుందాగా సాగింది,
    పదాలు తమదైన గొప్పని చాటుకుంటూ మీ శైలికి వన్నెతెస్తున్నాయి సత్యగారు.

    ReplyDelete
  2. అద్భుత భావ ఝరి . అభినందనలు డియర్ Satya Srinivas గారు. ...నూతక్కి రాఘవేంద్ర రావు. ...(కనకాంబరం).

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

పూల పుప్పొడి (ట్రిబ్యూట్ టు జి.ఉదయ్ భాస్కర్)

సరిహద్దు