ఇదీ వరస


వెదురు పొదలో

నలుపునీలిరంగు

పిట్టగూడు

చీకట్లొ పొద

పులుగు రంగు పులుముకుని

గాలి తాకిడికి

గారాబం ఒలికిస్తుంది

వేకువ

పక్షి

గంజివార్చడానికి

వెదురాకు రెక్కలుతొడిగి

గింజంత సూర్యుడ్ని 

ముక్కున

కర్చుకుని రాడానికి

వెళుతుంది

(12-3-13,మా వెదురు పొద)

Comments

  1. అక్షర వర్ణచిత్రం.. ఉదయపు ఓదార్పంత సహజంగా...

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

పూల పుప్పొడి (ట్రిబ్యూట్ టు జి.ఉదయ్ భాస్కర్)

పిల్లల చెట్టు

గూళ్ళ రెక్కలు