Posts

Showing posts from December, 2011

వార్షికోత్సవం

మునిమాపప్పుడు బడికి చేరిన పిల్ల పిట్టల గుసగుసలు మధ్యలో ఉపాధ్యాయ ప్రధానోపాధ్యాయురాలి ప్రసంగాలు పక్షుల కేరింతల్లా... బడివదిలి వెళ్ళే పక్షులు తమ రంగుల్ని ఆకాశానికి  అలిమి  వెళ్ళిపోతున్నాయి శిశిర వసంతాల్ని బడిచెట్లకిస్తూ... (కె.వి.కంచనబాగ్) 17-12-2011

స్తబ్దత...

కాలుతున్న కాలేయం చూపు నది నావ నావికుడు లేరు ఇసుక దిబ్బల గూడు --- సంకెళ్ళ ఆలోచనలు ఒక తనువు మనస్సు మనస్సులో తనువు మాటలు ----- పెదవుల పైన నవ్వు కదల్లేని మెదడులోని శరీరపు గడియారపు ముల్లు ----- కళ్ళు విచ్చుకోలేని   ఎవరి కలువలో! (9-12-2011)