Posts
Showing posts from November, 2010
బాగుంటుంది
- Get link
- X
- Other Apps
కొద్దిగా దగ్గరగా... కొద్దిగా దూరంగా... చోటు లేకుంటే బాగుంటుంది మనసుమాటకి కావల్సినంత కాలముంటుంది కలలకి నిద్రలేకుంటే బాగుంటుంది కళ్ళకి కబురులుంటాయి కలయికప్పుడు చూపు లేకుంటే బాగుంటుంది తనువుకి విరహస్పర్స చర్మమవుతుంది రోజూ కలవకపోతే బాగుంటుంది ఆలోచనలతో ఆకాశం రంగులు అద్దుకుంటుంది కొద్దిగా దగ్గరగా... కొద్దిగా దూరంగా... లేకుంటే బాగుంటుంది చెట్టు నీడని కౌగిలించుకుంటుంది