Posts

Showing posts from April, 2023

మదర్ ఎర్త్

  వూరవతలి ఇల్లు వాకిట్లో , వీధిలో ఇంట్లో అంతటా మొక్కలు , చెట్లు గదిలో మొక్కల్ని తరచుగా వాటి ప్రదేశాల్ని మారుస్తాను గోడలకి రుతువుల   పూలరంగులు అద్దుకుంటాయి వాకిట్లో పక్షుల గూళ్ళు చిగురిస్తాయి   నేల గంధం గాలి పువ్వు పరిమళం   ఇక వాటి వూ సులు అమ్మ జ్ఞాప కాల్లా ఇంటి ఆనవాళ్ళు   ఇల్లు నేల నింగి గడపకున్న సింధూర లంగరు ( 21-4-2023)