శ్లోక - ద జర్నీ
శ్లోక-1
పయనం
శ్లోక ముద్దు ముద్దు పలుకుల
వంటకాల ఘుమఘుమలు
బాల్యపు చెమ్మ
మనస్సు పెదవి పై
ఇంకా మిగిలిన
అమ్మ పెట్టిన
గోరుముద్ద పలుకు
శ్లోక-2
శ్లోక
చదువు ,సంధ్యల కబుర్లు
పిల్ల పంతులమ్మల ముందు
సదా విద్యార్ధులమే!
శ్లోక-3
శ్లోక మాటల బాటలో
పయనం
గమ్యం చేరడానికి కాదు!
ప్రయాణ కాలాన్నిగమ్యం చేస్కోడానికి!!
(కె. శ్లోక కు,28-2-2021)
Comments
Post a Comment