Posts

Showing posts from April, 2018

మేము,చిత్రిత కొంగ ,ప్రొక్లైనర్

మా ఇంటి వెనుక మైదానంలో కొంత కాలం క్రితం ఆమె, నేను నాటిన మామిడి,చిన్న వుసిరి, సీతాఫలం ,సపోటా,జామ, నేరేడు, మునగ ,చింత,నిమ్మ, గుల్మొహర్ , వేప మొక్కలు .. హరిత హారంలో భాగంగా   నాటిన కానుగ,రావి మొక్కలు... భారతి ఆంటీ నాటించిన మారేడు, వెలగ మొక్కలు... సుమారు 20 చెట్లు..... కొన్ని పూతకొచ్చాయి ఆ చెట్లిప్పుడు చాలా రకాల పక్షుల నివాస ప్రాంతాలు ఆ   ప్రాంతాన్ని పిల్లలు ఆడుకోడానికి అనువుగా ప్రొక్లైనర్ తో చదును చేయిస్తున్నారు యంత్రం నేలను చదును చేస్తునప్పుడు చెట్లకు ఇబ్బంది కలిగి అవి పెకలించబడతాయన్న శ్రద్ధతో కూడుకున్న భయంతో   కావలి కూర్చున్నా...   వాటికి నీళ్ళు పోసి, ఆమె , నేను వాట్ని పిల్లల్లా పెంచాము --------- ఎక్కడినుండో వచ్చింది ఒక చిత్రిత కొంగ ! యంత్రంతో బాటు భయంలేకుండా దాని   చుట్టూనే తిరుగుతోంది.ట్రాఫిక్లో బాగా తిరిగే అలవాటున్న ప్రాణంలా . సన్నిహితుడితో నగర రోడ్డుల్లో ఇష్టానుసారంగా   తిరిగినట్టు వుంది దాని స్వభావం.   ఒకప్పుడు పశువుల పైన వాలి తిరిగే సహజీవన వాసి అది. చిన్నపాటి అలికిడికి పశువులు తమ తోకాడించేవి. ఆ సౌ౦జ్ఞకు కొంగ పశువుల న...