ఎండుటాకుల వాకిలి
మిట్ట మధ్యాహ్నం నిర్మానుష్యమైన వీధిలో ఎవరో ఒంటరిగా వెళుతున్నట్టు కంట్లో నుండి జారిపోతున్న ఆలోచనలా గాల్లో ఎగిరి పోతుంటది ఓ ఎండుటాకు సాయంత్రం, ఎండుటాకులు సంధ్యాకాంతుల వెలుగు దివ్వెల చెరువు ఒడ్డు మాటలు లేని జ్ఞాపకాల చూపు రాత్రి ఎండుటాకుల నేలడవి ------ ముంగిట్లో రాలిన ఎండుటాకుల్ని ఉషోదయసంధ్యా కాలాల్లో ఆమె శుభ్రపరుస్తూనే వుంటుంది అలిగి వెళ్లిన వాళ్ళు ఇల్లు వదల్లేక అక్కడే తచ్చాడుతునట్టు మళ్ళీ తొలి కిరణాల్లా అవి ముంగిట్లో వాలుతూనే వుంటాయి ఎండుటాకుల వాకిలి మట్టి రేణువు పట్టీల తరంగం ( 26-7-15)