వెదురు వర్షపు చుక్కలు
వింటి బద్ద బాణం చూపు పశువుల్ని కాచే ముల్లు కర్ర ఇంటి దూలం ముచ్చట్ల తరంగాల తూనీగ : వెదురాకు రెక్క వెదురుకూర : గూటిలో మొలిచిన పుట్ట మన్ను పువ్వు వెదురన్నం :నేలగంధ పరిమళపు బువ్వ రాత్రింబవళ్ళ గాలి రాగాల నదీ గీతం :వెదురు వేణువు వెదురు పొదల సవ్వడి ; వెన్నంటి కాచే గురవడి [1] పలుకులు నా అడవి గుండె చప్పుడు : :పోతరాజు [2] గుఱ్ఱం అడుగుల ముద్ర ముగింపును గెలుపు సంకేతంగా ఎగరేసుకు పోయే పిట్ట : వెదురు పువ్వు మలుపుల దారిలో ఇంకా కొండ గుర్తుగా కళ్ళ గడపెదుటే నిల్చే వున్నాయి (ప్రపంచ వెదురు పొదల దినోత్సవం) 19/09/2014 [1] గిరిజన పూజారి [2] వెదురు పొదను పోతరాజు గా పూజిస్తారు