అతడు

హలో సార్
ఏప్పుడు చేరారు
మేడం గారు  బాగున్నారా
బాబు బాగున్నాడా
----
ఇది వాడికి యెన్నొ ఫొన్
తెలియదు
ఆఫీసులో
వాడికి పనిచెప్పడానికి
వీలుపడదు
చెపితె
ఫొన్లో చెప్పాలి
-------
సాగర్ నగర్ నుండి మహారానిపేట వరకు
సార్ వస్తున్నా  అంటూనే
అన్నా,తమ్ముడూ,
మామ,బామర్ది
ఆంటూ
ఆటొలో, బస్సులో,
నడక,ఫొన్లో
ప్రయాణం
విశాఖ నుండీ
పాడేరు వరకు
అంతే
------
భోజనం,నిద్ర ఒక చేత్తోనె
మరో చెతిలొ
ఫొన్
ఆఫ్ మైస్ & మెన్ లొని
ఒక క్యారెక్టర్ జెబిలొ యెలుకలా
యేప్ఫుడూ
వాడి దగ్గర వుంటుంది
నిద్రిస్త్తునప్పుడు ముసలి అవ్వ
 చేతిలో విసనకర్రలా
వాడి అరచేతిలొ
ఫొన్ విశ్రాంతి
పొంతుంది
అనుకొవడం భ్రమ
దొమ రింగ్ టొన్ ను
వీడి హలో ట్యూన్
ఖండిస్తుంది
ఇది చూసినప్పుడల్లా
గ్రహంబెల్ కి వీడికి
పోలిక కనపడుతుంది
ఒకరు ఫొన్ కనుక్కుంటే
వీడు దానితొ
మలేరియా అరికట్టె
ప్రయోగం చేశాడు
-------
కోరికల్లా
నిద్రుస్త్తున విష్ణు
పొజ్ లో వీడిని చూడాలని
చక్రం బదులుగా
సెల్ ఫొన్ తో పడుకున్న
పెద్ద ప్లెక్ష్స్ కట్ అవుటులా
ఏజెన్సి యెరియాలొ
ఓకే ఒక్క
కొండంత కట్ అవుట్
యేత్తైన కొండపైన
పెట్టాలని
--------
ఈ మలుపు దగ్గర
ఒక్క సారి ఆగి, కళ్ళు మూసుకుని, ఊహించండి,
-------
ముందుకు సాగండి
ఈ చిత్రం మిమ్మల్ని
యెప్పటికి
తప్పక వెంటాడుతుంది...
ఇంతకంటే
హిట్ ఇడియా లేదు
సర్ జీ...
-----
సారి
ఇతన్ని
పరిచయం
చేయడం మరిచాను
అరచేతంత డిజ్జ్ ప్ల్లె వుండే
మొబైయిలా వుంటాడు
టచ్ స్త్త్రీన్
మీద వేళ్ళుకదులుతున్నప్పుడు
తన్మయం పొందిన
వెళ్ళ లాంటి నొరు
సముద్ర గవ్వ
చెవిదగ్గర
పెట్టుకుంటే సంద్ర అలల గొషలను
వినిపించే మాటలు
మీరు ఒక్క అవుట్ గోయింగ్  ఇవ్వడం
ఆలస్యం
జీవితాంతం
టాక్ & వాక్ తొ జీవిస్తాడు
18-9-2010

Comments

Post a Comment

Popular posts from this blog

పూల పుప్పొడి (ట్రిబ్యూట్ టు జి.ఉదయ్ భాస్కర్)

గూళ్ళ రెక్కలు

పిల్లల చెట్టు