Posts

Showing posts from November, 2025

శిధిలాలు

Image
      శిధిలాలైపోయిన   పురాతన గుడుల్లో నిశబ్దం సంక్షిప్తమైన ఖనిజం నిశబ్ద వారధులుగా వున్న మిగిలిన వృక్షాలు చెట్టు బెరడు , గుడి గోడల్లోన్ని నీటి చారల్లో చరిత్ర గూడు   కట్టుకుంటుంది అక్కడి నిర్మానుష్యం చెట్టు మీదున్న ఒంటరి పిట్ట కూత మరుగైపోయిన గంటల ప్రతిధ్వని మనస్సులో మారుమోగుతుంది కళ్ళలోని ధూపంలా పరివ్యాపిస్తుంది శిధిలమైన గుడుల చుట్టూ ప్రదేశం నేల పొరల్లో బీజమైపోయిన   సంస్కృతీ కదలని రధ చక్రం అక్కడి ఆవరణ శూన్యానికి జేల్లుకట్టు క్రీడా మైదానం శిధిలమైన హంపీ ఆలయాల నేల ధూళి మట్టి కాటుక (మోషేకి, నీ హంపి చ్జ్హిత్రాలకి.... బిట్వీన్ బ్లాక్ & వైట్ చిత్ర ప్రదర్శనకు   ప్రేమతో , 15-11-2025) ---జి.సత్య శ్రీనివాస్