Posts

Showing posts from June, 2016

పిల్లల చెట్టు

పుట్ట మన్నుతో కట్టిన బొమ్మరిల్లుని మరమ్మత్తులు చేసిన వేసవి సూరీడు అరచేతిలో భూమిని  ఉండలు కట్టుకుని తిరిగేకుమ్మరిపురుగు చెట్టు ఆకాశం తిరగేసిన మబ్బుల గొడుగు వేసవి సెలవులు జీవితాంతం నెమరేసుకునే జ్ఞాపకాల కాలం అవును బాల్యం, మనలో ఎప్పటికీపొదిగివున్న మధుర బీజం అప్పుడప్పుడూ కొన్ని చినుకుల్ని గుండెలమీద చల్లుకుందాం ఓ పచ్చని గాలి శ్వాసలా తనువు ఆవరణను అల్లుకుంటుంది నేలగంధం  పరిమళాన్ని ఆస్వాదిస్తూ కొమ్మల మంత్ర తివాచీ మీద ఓ జీవిత కాలం పయనాన్ని అమర్చే గూడులో ఒదిగిపోదాం ( 13-6-16)