తుంపర వర్షం
ఆకులపై నుండి తుంపర్ల గాలి నను తాకుతూ సాగిపోతుంది పెదవులకున్నముద్దె౦గిల్ని తడిచేసుకుంటూ చూపుడు వేలుతో పేజీలు తిరగేస్తున్నాను ఆకు చివరి నుండి బొట్టు బొట్టుగా రాలుతున్న చినుకులు వేర్ల లోకి ఇంకుతూ ఇరు తనువుల మట్టి మనస్సు ఒకటైన వేళలా తెల్ల సంఫెంగల పరిమళం చీకటికి ధూపమేస్తోంది ముగింపు పేజిలో అసలు కధ మొదలైనట్టు అంతలోనే ఆమె రింగ్ టోన్ ‘ ఇమ్లిబన్ లో బస్ ఎక్కాను ,మొక్కలు జాగ్రత్త ’ ‘ సరే అక్కడ వర్షం వుందా ’ ‘ ఆ.. తుంపర్లు పడుతున్నాయి ’ ఇక చింత లేదు తడిగాలి నమ్మకం ఇరువురికీ డ్రైవరైనట్టు ఇక ఎడబాటు లేని ప్రయాణం కొనసాగుతుంది... (20-9-14)