సెలవులు
పిల్లాడు లేనియింట్లో వాడి జ్ఞాపకాలు నెమరేసుకుంటూ... కుక్క పిల్లలతో ఆడుకోవడం వాడిలాగానే అవ్వడం రాత్రికి దిగులు కలిగించడం పగలుకి వెలుతురు పూయడం కనుపాపకి బాల్యం తొడగడం ఇద్దరం పసితనంతో తిరగడం ఇంట్లోకి పసిసవ్వడ్ని రమ్మనడం ఇళ్ళని కపటంలేని మొక్కలరంగులతో పెంచడం (10-6-2011)