నేల తరం




ఉదయం 

సూర్యుడు రాక మునుపు

ఆకాశం చంద్రుడి వెలుగుని

విదుల్చుకుని వెళ్ళిపోతుంది


సాయంత్రం

చంద్రుడు వచ్చేముందు

ఆకాశం సూర్యుడి కాషాయ రంగుని

అద్ది వెళ్ళి పోతుంది


ఇంటి ముందు 

కళ్ళాపు చల్లి ముగ్గులేసిట్టినట్లు...


నగరంలో

ఈ కాలాల్లో

ఇంట్లో కరెంటు దీపాలు వెలిగించుకుంటారు

వాకిలి కిటికి రంగుని

లోనికి రానియ్యకుండా...


నేల ముంగిట తరం మారింది

( 17-6-13)


Comments

Popular posts from this blog

పూల పుప్పొడి (ట్రిబ్యూట్ టు జి.ఉదయ్ భాస్కర్)

పిల్లల చెట్టు

గూళ్ళ రెక్కలు