క్షీణత


కనుచూపుమేరంత
వుండే విశాలమైన స్థలం
నేల చీర
వివిధ రంగుల్లో
ఫ్రశాంతతని
పరిచినట్టు
నది ఒడ్డున
చాకిరేవులోని
రంగుల బట్టల్లా
నింగి నేల నీటి ప్రదేశాలు

ఇప్పుడంతా
ఖాళీతనాన్ని
కోల్పోయిన
పుడమి
కోరిక రెక్కలు
ఎగరలేని
ఇరుకుతనం
కంట్లోకట్టుకున్న గోడల్లో 
సమాధైన
మనస్సు చూపు 
బొంద మీద
మట్టిలా
(24-1-13)

Comments

Popular posts from this blog

ఊయ్యా...ల...జంపా...ల

పూల పుప్పొడి (ట్రిబ్యూట్ టు జి.ఉదయ్ భాస్కర్)