'Nela Kannu', an anthology of poems written by me, is now available for free download from Vikasa Dhatri, a website offering Telugu e-Books for download at no cost.
కొన్ని జ్ఞాపకాలు భలే ముచ్చటగా వుంటాయి.పూల పుప్పొడిలా... కొన్ని పూలని తాకి న తర్వాత యా ధ్రుచ్చి కంగా ముక్కు మీ ద ,బుగ్గ మీ ద , ను దుటి న చెయ్యి పెట్టినప్పుడు , వేళ్ళకి అంటుకున్న పూల పుప్పొడి అక్కడంతా అంటుకుం టుంది .జ్ఞాపకా లూ అంతే ! కొద్ది పాటి ఆనందాన్ని , బాధ ని , కించిత్ జ్ఞానాన్ని ఇస్తాయి. అవి మనని కాసేపు మనోలో నే , మనతోనే ఆగేటట్లు,మాట్లాడుకు నేట్లు చేస్తాయి. ఆ జ్ఞా ప కాలకు రూపం ఇచ్చిన ప్రదేశాలు , సంఘటనలు , వ్యక్తులను నె మరోస్కోమని ! అప్పుడు మన ఆలోచనలు కొత్తగా మొలకెత్తుతాయి. .మరి ఎటు చూసినా ఆ వ్య క్తి రూపం చాలా వాటిల్లో ప్రతిరూపమో , ప్రతిబింబమో అ యి తే ? అది కేవలం జ్ఞాపకం కాదు,పూల పుప్పొడి నరనరాల్లో జీర్ణిం చుకు పోయిన రక్తం అ యితే.. ..అది నాకు మటుకు గుడ్లవల్లేటి ఉదయ్ భాస్కర్ , ఉ రఫ్ బాచి , మా మూడో అన్నయ్య. ........ తను సింగరేణి కాలరీస్ ఎ క్స్ప్లోరే షన్ డివిజన్ నుండి మే నేజర్గా రిటైర్ అయ్యి. హైదరాబాద్ లో సెటిల్ అవుదామని నగరం అంతా తిరిగాడు ఇల్లు కోసం. తన కు మటుకి తెల్సు ఎటువంటి ఇల్లు కావాలని.చివరికి షామీర్ పే ట...
శిధిలాలైపోయిన పురాతన గుడుల్లో నిశబ్దం సంక్షిప్తమైన ఖనిజం నిశబ్ద వారధులుగా వున్న మిగిలిన వృక్షాలు చెట్టు బెరడు , గుడి గోడల్లోన్ని నీటి చారల్లో చరిత్ర గూడు కట్టుకుంటుంది అక్కడి నిర్మానుష్యం చెట్టు మీదున్న ఒంటరి పిట్ట కూత మరుగైపోయిన గంటల ప్రతిధ్వని మనస్సులో మారుమోగుతుంది కళ్ళలోని ధూపంలా పరివ్యాపిస్తుంది శిధిలమైన గుడుల చుట్టూ ప్రదేశం నేల పొరల్లో బీజమైపోయిన సంస్కృతీ కదలని రధ చక్రం అక్కడి ఆవరణ శూన్యానికి జేల్లుకట్టు క్రీడా మైదానం శిధిలమైన హంపీ ఆలయాల నేల ధూళి మట్టి కాటుక (మోషేకి, నీ హంపి చ్జ్హిత్రాలకి.... బిట్వీన్ బ్లాక్ & వైట్ చిత్ర ప్రదర్శనకు ప్రేమతో , 15-11-2025) ---జి.సత్య శ్రీనివాస్
Comments
Post a Comment