Posts

ప్రార్ధన

తాగుబోతులను వినకండి గుండె మాటల గోషను కక్కుకుంటారు తాగుబోతులతో వుండకండి నిద్రపొనికుండా కళ్ళ వాకిళ్ళ దగ్గర కావలిపెడతారు వాళ్ళు లేకుండా వుండే ప్రపంచాన్ని దేవుడ్ని తాగకుండా సృష్టించమని కోరండి (11-2-2011)

ధ్యానం

మెదడ్లొని చీకటి కన్ను రెపరెపలాడుతుంది కన్నుల్లొని మెదడు మనస్సు స్వఘతం మాట్లాడుకుంటుంది శరీరానికి కంటి కింద చారలు పడకుండా వీట్ని వదిలి తన గడియారపు ముల్లుని కట్టేసి సమయానికి పడుకొవాలన్న తపన (11-2-2011)

మున్ముందే

అక్షరాల పాదాల నీడనల్లుకుని పడుకుంటాను మెదడంతా పదాలాట సంభాషణ మేలుకున్న రాత్రి కదులుతుంది తలుపు మూసినా తెరిచినా తేడాలేదు నిద్రాలోచనలో తపన అక్షర సత్యం
Image

బాగుంటుంది

కొద్దిగా దగ్గరగా... కొద్దిగా దూరంగా... చోటు లేకుంటే బాగుంటుంది మనసుమాటకి కావల్సినంత కాలముంటుంది కలలకి నిద్రలేకుంటే బాగుంటుంది కళ్ళకి కబురులుంటాయి కలయికప్పుడు చూపు లేకుంటే బాగుంటుంది తనువుకి విరహస్పర్స చర్మమవుతుంది  రోజూ కలవకపోతే బాగుంటుంది ఆలోచనలతో ఆకాశం రంగులు అద్దుకుంటుంది కొద్దిగా దగ్గరగా... కొద్దిగా దూరంగా... లేకుంటే బాగుంటుంది  చెట్టు నీడని కౌగిలించుకుంటుంది

నాలో నేను

ఒడ్డునున్న తాటి చెట్టు పడవలోని జాలరి నీళ్ళ నీడ నీళ్ళ పొర నేల నీడ మబ్బుల నీడలన్నీ మట్టి కన్ను వర్షం కొండలంచున సూర్యుడు కుంపట్లో నిప్పు బువ్వతిని పడుకోవడం మళ్ళీ కొండకంటున్న నిప్పుతొ లేవడం తిరగడం దారుల నడకల్లన్నీ అలల చూపు (పొరుమామిళ్ళ నుండి మైదుకురు,13/10/2010)

కొసమెరుపు

కదులుతున్న చీమల దండు ఇక్యం ఒకదాని వెనుకొకటి మమైకం రంగులుమార్చుకునే మబ్బు తెలుపు స్ధానం ఇచ్చిపుచ్చుకున్నాం కొంత మగతని, నిద్రని ఒకరిస్ధానాన్ని మరొకరితొ మరోకరి స్ధానాన్ని మనతో ఆటస్ధలం పిల్లలాడుకునే టైమయ్యింది వాళ్ళ ఆటని చుస్తూ మనం ఆడిన తీరుని చర్చింకుందాం మళ్ళీ రేపటాట మెళకువలకి (19-9-2010)