Posts

మున్ముందే

అక్షరాల పాదాల నీడనల్లుకుని పడుకుంటాను మెదడంతా పదాలాట సంభాషణ మేలుకున్న రాత్రి కదులుతుంది తలుపు మూసినా తెరిచినా తేడాలేదు నిద్రాలోచనలో తపన అక్షర సత్యం
Image

బాగుంటుంది

కొద్దిగా దగ్గరగా... కొద్దిగా దూరంగా... చోటు లేకుంటే బాగుంటుంది మనసుమాటకి కావల్సినంత కాలముంటుంది కలలకి నిద్రలేకుంటే బాగుంటుంది కళ్ళకి కబురులుంటాయి కలయికప్పుడు చూపు లేకుంటే బాగుంటుంది తనువుకి విరహస్పర్స చర్మమవుతుంది  రోజూ కలవకపోతే బాగుంటుంది ఆలోచనలతో ఆకాశం రంగులు అద్దుకుంటుంది కొద్దిగా దగ్గరగా... కొద్దిగా దూరంగా... లేకుంటే బాగుంటుంది  చెట్టు నీడని కౌగిలించుకుంటుంది

నాలో నేను

ఒడ్డునున్న తాటి చెట్టు పడవలోని జాలరి నీళ్ళ నీడ నీళ్ళ పొర నేల నీడ మబ్బుల నీడలన్నీ మట్టి కన్ను వర్షం కొండలంచున సూర్యుడు కుంపట్లో నిప్పు బువ్వతిని పడుకోవడం మళ్ళీ కొండకంటున్న నిప్పుతొ లేవడం తిరగడం దారుల నడకల్లన్నీ అలల చూపు (పొరుమామిళ్ళ నుండి మైదుకురు,13/10/2010)

కొసమెరుపు

కదులుతున్న చీమల దండు ఇక్యం ఒకదాని వెనుకొకటి మమైకం రంగులుమార్చుకునే మబ్బు తెలుపు స్ధానం ఇచ్చిపుచ్చుకున్నాం కొంత మగతని, నిద్రని ఒకరిస్ధానాన్ని మరొకరితొ మరోకరి స్ధానాన్ని మనతో ఆటస్ధలం పిల్లలాడుకునే టైమయ్యింది వాళ్ళ ఆటని చుస్తూ మనం ఆడిన తీరుని చర్చింకుందాం మళ్ళీ రేపటాట మెళకువలకి (19-9-2010)

అతడు

హలో సార్ ఏప్పుడు చేరారు మేడం గారు  బాగున్నారా బాబు బాగున్నాడా ---- ఇది వాడికి యెన్నొ ఫొన్ తెలియదు ఆఫీసులో వాడికి పనిచెప్పడానికి వీలుపడదు చెపితె ఫొన్లో చెప్పాలి ------- సాగర్ నగర్ నుండి మహారానిపేట వరకు సార్ వస్తున్నా  అంటూనే అన్నా,తమ్ముడూ, మామ,బామర్ది ఆంటూ ఆటొలో, బస్సులో, నడక,ఫొన్లో ప్రయాణం విశాఖ నుండీ పాడేరు వరకు అంతే ------ భోజనం,నిద్ర ఒక చేత్తోనె మరో చెతిలొ ఫొన్ ఆఫ్ మైస్ & మెన్ లొని ఒక క్యారెక్టర్ జెబిలొ యెలుకలా యేప్ఫుడూ వాడి దగ్గర వుంటుంది నిద్రిస్త్తునప్పుడు ముసలి అవ్వ  చేతిలో విసనకర్రలా వాడి అరచేతిలొ ఫొన్ విశ్రాంతి పొంతుంది అనుకొవడం భ్రమ దొమ రింగ్ టొన్ ను వీడి హలో ట్యూన్ ఖండిస్తుంది ఇది చూసినప్పుడల్లా గ్రహంబెల్ కి వీడికి పోలిక కనపడుతుంది ఒకరు ఫొన్ కనుక్కుంటే వీడు దానితొ మలేరియా అరికట్టె ప్రయోగం చేశాడు ------- కోరికల్లా నిద్రుస్త్తున విష్ణు పొజ్ లో వీడిని చూడాలని చక్రం బదులుగా సెల్ ఫొన్ తో పడుకున్న పెద్ద ప్లెక్ష్స్ కట్ అవుటులా ఏజెన్సి యెరియాలొ ఓకే ఒక్క కొండంత కట్ అవుట్ యేత్తైన కొండపైన పెట్టాలని -------- ...

అచ్చంగా...

అచ్చంగా... పదాల పాదాలానీడ రాత్రిలో పడుకుంటాను మెదడంతా అక్షరాల సంభాషణ మేలుకున్న రాత్రి పదం కదులుతుంది తలుపు మూసినా తేరిచినా తేడాలెదు ఆలోచనకంటే మున్ముందే  నిద్రించాలన్న తపన అక్షర సత్యం (17-9-2010)